Jaipur: ఫైవ్ స్టార్‌ హోటల్‌లో బాలుడి చోరీ.. రూ.1.50 కోట్లతో పరార్!

Minor boy decamps with bag containing Rs one and half cr from Jaipur wedding venue
  • జైపూర్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో పెళ్లి వేడుక
  • స్నేహితుడితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా హోటల్‌లోకి ప్రవేశించిన బాలుడు 
  • వరుడి తల్లి పక్కన ఉన్న బ్యాగుతో పరార్
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు
రాజస్థాన్‌లోని జైపూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో 14 ఏళ్ల బాలుడు భారీ చోరీకి పాల్పడ్డాడు. పెళ్లి కొడుకు తల్లికి చెందిన రూ.1.50 కోట్లున్న బ్యాగును ఎవరికీ అనుమానం రాకుండా ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన యువకుడి వివాహ వేడుకను జైపూర్ లోని హోటల్ హయత్‌లో ఆగస్టు 8న ఏర్పాటు చేశారు. వరుడి తండ్రికి మెడికల్ బిజినెస్ ఉంది. 

పెళ్లి రోజున వరుడు తన కుటుంబసభ్యులతో కలిసి ఏనుగు మీద ఊరేగింపుగా హోటల్‌కు వెళ్లాడు. ఆ హడావుడిలో 14 ఏళ్ల బాలుడు, తన స్నేహితుడితో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా హోటల్‌లోకి చొరబడ్డాడు. అక్కడ నిందితులిద్దరూ పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులను, వారి వస్తువులను జాగ్రత్తగా పరిశీలించారు. ఈ క్రమంలో పెళ్లి మండపం వద్ద ఉన్న వరుడి తల్లి.. రూ.1.50 కోట్ల నగదు ఉన్న బ్యాగును కింద పెట్టింది. ఇదే అదనుగా భావించిన మైనర్, బ్యాగును ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా ఎత్తుకెళ్లిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
Jaipur
Minor boy Theft
Wedding
Hyderabad

More Telugu News