వరంగల్ ఆసుపత్రిలో దారుణం... పసిగుడ్డును పీక్కుతిన్న కుక్కలు!
- నిత్యం జనం తిరిగే ప్రాంతంలోనే ఘటన
- సగం బాడీని తినేయడంతో గుర్తుపట్టలేని విధంగా పసికందు
- వివరాలు సేకరిస్తున్న అధికారులు, పోలీసులు
ఆ పసికందు ఆడనా, మగనా? అనేది తెలియాల్సి ఉంది. సగం బాడీని కుక్కలు తినేయడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పసికందు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వారి చిన్నారి కాకపోవచ్చునని భావిస్తున్నారు. డెడ్ బాడీని తీసుకువచ్చి ఎంజీఎం పరిసరాల్లో వదిలివేసినట్లు అనుమానిస్తున్నారు.