చేనేత దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
- స్వాతంత్ర్య సంగ్రామంలో చేనేత ఒక సాధనమైందన్న రేవంత్ రెడ్డి
- నేటి తెలంగాణ పునర్నిర్మాణంలోనూ చేనేత ప్రధానంగా నిలిచిందని వెల్లడి
- చేనేతకు పునరుజ్జీవనం కోసం తమ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని వెల్లడి
'నిండైన భారతీయతకు నిజమైన అందాన్ని ఇచ్చే చేనేత వస్త్రాలను ధరిద్దాం. నేతన్నలకు ప్రోత్సాహాన్ని అందిద్దాం. నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.