మదనపల్లె కేసు సీఐడీకి బదిలీ
- మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన దర్యాప్తు బాధ్యత సీఐడీకి
- ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు
- రెండు రోజుల్లో సీఐడీకి అప్పగించనున్న మదనపల్లె పోలీసులు
గత నెల 21వ తేదీ రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు దహనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మదనపల్లె పోలీసులు తొమ్మిది కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవడంతో పలువురు ఉద్యోగులు, నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దగ్ధమైన వాటిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారంతో ముడిపడిన రికార్డులు, కీలకమైన నిషేధిత భూముల జాబితాకు సంబంధించి రికార్డులు ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.