Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం... హోటల్‌కు నిప్పు... 24 మంది సజీవదహనం!

At least 24 burnt alive by mob in hotel
  • 21 రోజులుగా విద్యార్థి సంఘాల ఆందోళనలు
  • జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు నిప్పు
  • మృతి చెందిన 24 మందిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు
బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు ఉన్నాడని లోకల్ మీడియా చెబుతోంది. ఆందోళనకారులు నిప్పు పెట్టిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది.  

21 రోజులుగా విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440కి చేరుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా కృషి చేస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
Bangladesh

More Telugu News