X: మకాం మార్చుతున్న ఎక్స్... వేరే మార్గం లేదన్న ఎలాన్ మస్క్

Soical media giant X will shift its headquarters from San Francisco
  • ఇప్పటిదాకా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఎక్స్ కార్యకలాపాలు
  • శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కార్యకలాపాలు కొనసాగింపు కష్టతరంగా మారిందన్న మస్క్
  • దీనిపై గత నెలలోనే సంకేతాలు
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తన మకాం మార్చుతోంది. ఈ వార్త కొద్ది వ్యవధిలోనే వైరల్ అయింది. దీనిపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు.

అమెరికా పశ్చిమ తీరంలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కార్యకలాపాలు కొనసాగించడం కష్టతరంగా మారిందని, ఎక్స్ ప్రధాన కార్యాలయాన్ని మరో చోటికి తరలించడం తప్ప వేరే మార్గం లేదని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధన యాత్రల సంస్థ స్పేస్ ఎక్స్ లతో పాటు, ఎక్స్ కార్యాలయాన్ని కూడా తరలిస్తామని ఎలాన్ మస్క్ కిందటి నెలలోనే చెప్పారు. 

2006లో ట్విట్టర్ ప్రారంభం కాగా, అప్పటి నుంచి ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చి ఎక్స్ గా మారే వరకు శాన్ ఫ్రాన్సిస్కోలోనే కొనసాగుతోంది. 

ముఖ్యంగా, చెల్లింపుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎక్స్ ప్రధాన కార్యాలయంతోపాటే స్ట్రైప్, బ్లాక్ (క్యాష్ యాప్) తదితర కార్యాలయాలను కూడా వేరేచోటికి మార్చుతున్నామని మస్క్ వివరించారు. 

ఎక్స్ సీఈవో లిండా యక్కారినో ఇప్పటికే తమ సంస్థ ఉద్యోగులకు కార్యాలయ తరలింపుపై ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారు. మార్పుకు అందరూ సంసిద్ధం కావాలని సూచించారు.
X
Headquarters
San Francisco
Elon Musk
USA

More Telugu News