Chandrababu: టాప్-10లో ఒక్క ఏపీ యూనివర్సిటీ లేకపోవడం బాధాకరం: సీఎం చంద్రబాబు

CM Chandrababu held meeting with collectors
  • అమరావతిలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం
  • నైపుణ్యాభివృద్ధి, విద్య తదితర అంశాలపై చర్చ
  • గతంలో నాక్ అక్రెడిటేషన్ టాప్-10లో ఏపీ వర్సిటీలు ఉండేవన్న చంద్రబాబు
  • ప్రస్తుతం రాష్ట్రంలో వర్సిటీల పరిస్థితి పట్ల విచారం
ఏపీ రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రపంచస్థాయి ఉద్యోగాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యార్థుల నైపుణ్యాలు పెంచే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. 

ఈ సందర్భంగా ఏపీలోని యూనివర్సిటీల పరిస్థితి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గతంలో నాక్ అక్రెడిటేషన్ లో ఏపీ విశ్వవిద్యాలయాలు టాప్-10లో ఉండేవని, కానీ ఇప్పుడు ఏపీకి చెందిన ఒక్క వర్సిటీ కూడా టాప్-10లో లేకపోవడం బాధాకరమని అన్నారు. 

మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలని చంద్రబాబు అభిలషించారు. అంతర్జాతీయస్థాయిలో నైపుణ్యాలు సాధించేలా శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. 

వర్చువల్ వర్కింగ్ కోసం ఓ విధానం రూపొందించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్చువల్ వర్కింగ్ హబ్ గా అవతరించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. త్వరలో వర్క్ షాప్ ఏర్పాటు  చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు.
Chandrababu
Collectors
Meeting
Universities
Andhra Pradesh

More Telugu News