2nd ODI: రెండో వన్డే: టీమిండియాపై టాస్ నెగ్గిన శ్రీలంక

Sri Lanka won the toss against Team India in 2nd ODI
  • టీమిండియా, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్
  • టైగా ముగిసిన తొలి వన్డే
  • నేడు రెండో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య శ్రీలంక
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం ఈ పోరుకు వేదిక. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు. తొలి వన్డేలో ఆడిన జట్టే ఈ మ్యాచ్ లోనూ ఆడుతోంది. మరోవైపు, శ్రీలంక జట్టులో రెండు మార్పులు జరిగాయి. హసరంగ, షిరాజ్ స్థానంలో కమిందు, వాండర్సే జట్టులోకి వచ్చారు. 

ఇరుజట్ల మధ్య ఇదే మైదానంలో జరిగిన తొలి వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే. గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. 18 బంతుల్లో 5 పరుగులు చేస్తే గెలుస్తారనగా... చివరి రెండు వికెట్లను వెంటవెంటనే కోల్పోయి విజయాన్ని చేజేతులా దూరం చేసుకుంది. నేటి మ్యాచ్ లోనూ టీమిండియా చేజింగ్ చేయాల్సి ఉండడంతో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
2nd ODI
Team India
Sri Lanka
Toss
Colombo

More Telugu News