కోల్‌కతా విమానాశ్రయాన్ని ముంచెత్తిన వరద నీరు... ఇదిగో వీడియో!
ఇక భారీ వర్షానికి కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నీట మునిగింది. ఎయిర్‌పోర్ట్ రన్‌వేపైకి భారీగా వరద నీరు చేరింది. విమానాల పార్కింగ్ జోన్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో కోల్‌కతా నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.