సోమాలియాలో ఉగ్రదాడి... 32 మంది మృతి

  • హోటల్ పై ఆత్మాహుతి దాడి
  • చెల్లాచెదురుగా మృతదేహాలు
  • కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు
  • దాడికి పాల్పడింది తామేనంటూ ప్రకటించిన అల్ ఖైదా అనుబంధ సంస్థ
ఆఫ్రికా ఖండంలోని అత్యంత పేద, కల్లోలభరిత దేశాల్లో ఒకటైన సోమాలియాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. ఓ హోటల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 32 మంది మరణించారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ అల్ ఖైదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది. 

సోమాలియా రాజధాని మొగదిషు నగరంలోని లిడో బీచ్ కు సమీపంలో ఉన్న ఈ హోటల్ పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వంటినిండా పేలుడు పదార్థాలు అమర్చుకుని తనను తాను పేల్చుకున్నాడు. భద్రతా బలగాలు స్పందించి కాల్పులు జరగడంతో నలుగురు సాయుధ ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు.

Somalia
Terror Attack
Mogadishu
Hotel
Al Qauda
Al Shabaab

More Telugu News