Israel: ఇజ్రాయెల్‌లో అప్రమత్తంగా ఉండండి: భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ

Indian Embassy in Israel issues advisory for citizens
  • ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అడ్వైజరీ
  • భద్రతా నియమాలు పాటించాలని భారత పౌరులకు సూచన
  • అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీని సంప్రదించాలని సూచన
ఇజ్రాయెల్ - మధ్య ప్రాచ్యం‌లోని లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయులకు భారత ఎంబసీ అడ్వైజరీని జారీ చేసింది. "అప్రమత్తంగా ఉండండి, భద్రతా నిబంధనలు పాటించండి" అని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం (ఆగస్ట్ 2) సూచించింది. హమాస్, హిజ్బుల్లా అగ్రనేతల మృతితో ఆందోళనకర పరిస్థితులు ఉండంతో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.

ఇజ్రాయెల్‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడి భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. స్థానిక అధికారుల ప్రోటోకాల్స్ పాటించాలని సూచించింది. "దయచేసి జాగ్రత్తగా ఉండండి. దేశంలో (ఇజ్రాయెల్) అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండండి. సురక్షిత ప్రాంతాల వద్ద ఉండండి. భారత ఎంబసీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారతీయుల భద్రత కోసం ఇజ్రాయెల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది" అని పేర్కొంది.

అత్యవసర పరిస్థితుల్లో 24x7 హెల్ప్‌లైన్ నెంబర్లు, ఎంబసీ ఈ-మెయిల్ ఐడి ద్వారా సంప్రదించాలని సూచించింది. అత్యవసరమైతే 24 x 7 హెల్ప్ లైన్ నెంబర్లు  +972-547520711...  +972-543278392 ద్వారా సంప్రదించవచ్చునని సూచించింది. [email protected] ద్వారా ఎంబసీతో టచ్‌లో ఉండవచ్చునని తెలిపింది.
Israel
India

More Telugu News