AP High Court: పోలీసు భద్రత విషయంలో ఏపీ హైకోర్టులో పొన్నవోలుకు చుక్కెదురు

Shock to Ponnavolu in Additional security petition
  • పోలీస్ భద్రతను పొందడానికి పొన్నవోలు అనర్హుడన్న హైకోర్టు
  • రాజ్యాంగ, చట్టబద్ద పదవులు నిర్వహించినంత మాత్రాన భద్రతకు అర్హులు కాదని స్పష్టీకరణ
  • ప్రాణహాని ఉందని నిర్ధారణ జరిగి సెక్యూరిటీ కల్పిస్తే ఆ ఖర్చులు పొన్నవోలు భరించాలన్న హైకోర్టు
పోలీసు భద్రత విషయంలో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీసు భద్రతను పొందడానికి ఆయన అనర్హుడని హైకోర్టు తేల్చి చెప్పింది. తనకు అదనపు భద్రతను కల్పించాలని కోరుతూ పొన్నవోలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది.

రాజ్యాంగ, చట్టబద్ధ పదవులు నిర్వహించినంత మాత్రాన పోలీసు భద్రతకు అర్హులు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆయనకు ఎలాంటి ప్రాణహానీ లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా నిర్ధారించిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కమిటీ నివేదికపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సవాల్ చేసుకోవచ్చునని తెలిపింది. ప్రాణహాని ఉందని నిర్ధారణ జరిగి, ప్రభుత్వం భద్రత కల్పిస్తే ఆ ఖర్చు పొన్నవోలు భరించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
AP High Court
Andhra Pradesh
Security

More Telugu News