Ram Charan-Uapasana: రామ్ చరణ్-ఉపాసన దంపతులపై క్లీంకార కేర్ టేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Klin Kaara Care Taker Lalitha interesting comments on Ram Charan and Upasana
  • 2012లో రామ్ చరణ్, ఉపాసనల వివాహం
  • 2023 జూన్ 20న క్లీంకార జననం
  • క్లీంకార కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్ నియామకం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన ఇద్దరిదీ బిజీ లైఫ్. అందుకే వారు తమ ముద్దుల పాప క్లీంకార కోసం ఒక స్టార్ కేర్ టేకర్ (నానీ)ను నియమించారు. ఆమె పేరు లలిత. 

లలిత గతంలో అంబానీ కుటుంబంలో చిన్నారులకు కూడా కేర్ టేకర్ గా పనిచేశారు. ప్రస్తుతం క్లీంకార కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్-ఉపాసన దంపతుల గురించి చెప్పుకొచ్చారు. 

గతంలో తాను అంబానీ ఫ్యామిలీ సహా అనేక సంపన్న కుటుంబాల్లోని చిన్నారులకు కేర్ టేకర్ గా వ్యవహరించానని వెల్లడించారు. తనను ఆ కుటుంబాలన్నీ బాగా చూసుకున్నాయని తెలిపారు. ఇక, రామ్ చరణ్-ఉపాసన తమ కుమార్తె క్లీంకార విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తారని, మంచి తల్లిదండ్రులకు వాళ్లను ఉదాహరణగా చెప్పొచ్చని అభిప్రాయపడ్డారు. వారిద్దరిదీ మంచి మనసు అని కితాబునిచ్చారు. 

గతంలో తాను ఉత్తరాది కుటుంబాల్లో కేర్ టేకర్ గా చేశానని, అయితే, అక్కడికి ఇక్కడికి ఆహారపు అలవాట్లలో చాలా తేడా ఉంటుందని లలిత పేర్కొన్నారు. రామ్ చరణ్ కుటుంబం చాలా మంచిదని కొనియాడారు. 

ఉపాసన అపోలో ఫౌండేషన్ చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ, ఎంతో నిరాడంబరంగా ఉంటారని తెలిపారు. నేను విశ్రాంతి తీసుకునేటప్పుడు క్లీంకారను ఉపాసన చూసుకుంటారు... పాపను ఎత్తుకో, సరిగ్గా చూసుకో అంటూ ఒత్తిడి చేయరు... ఉపాసన ఎంతో వినయశీలి అంటూ లలిత వివరించారు. 

అంతేకాదు, వారి కుటుంబంలో తనను కూడా ఓ సభ్యురాలిగానే చూస్తారని సంతోషం వ్యక్తం చేశారు.
Ram Charan-Uapasana
Klina Kaara
Lalitha
Care Taker
Hyderabad
Tollywood

More Telugu News