Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలను ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి ముందుకు తీసుకెళ్లాలి: చిరంజీవి

Chiranjeevi responds on CM Revanth Reddy disappointment over his propasal for Gaddar Awards
నంది అవార్డుల తరహాలో సినీ రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదన పట్ల చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని పేర్కొన్నారు. 

ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీద సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రతి ఏటా గద్దర్ అవార్డులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత... ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేలా తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి బాధ్యత తీసుకోవాలని చిరంజీవి కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Chiranjeevi
Revanth Reddy
Gaddar Awards
Tollywood
Telangana

More Telugu News