Madanapalle Incident: పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ నివాసంలో ముగిసిన సోదాలు!

Police searches in Peddireddy PA Sasikanth residence
  • మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసుల విచారణ వేగవంతం
  • గతరాత్రి నుంచి హైదరాబాదులోని శశికాంత్ నివాసంలో సోదాలు
  • శశికాంత్ నివాసంలో భారీగా ఫైళ్లను గుర్తించిన పోలీసులు!
మదనపల్లె ఫైళ్ల దగ్ధం వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హైదరాబాదులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ నివాసంలో సోదాలు ముగిశాయి. ఏపీ పోలీసులు నిన్న రాత్రి నుంచి హైదరాబాదులోని అయ్యప్ప సొసైటీలో ఉన్న శశికాంత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు శశికాంత్ నివాసంలో భారీగా ఫైళ్లను గుర్తించారు. పోలీసులు అతడి నివాసం నుంచి నాలుగు పెట్టెల నిండా ఫైళ్లను తరలించినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ సోదాల్లో పలు కీలక  పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
Madanapalle Incident
Peddireddy
Sasikanth
Police
Hyderabad
Andhra Pradesh

More Telugu News