Chandrababu: పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు

CM Chandrababu thanked Pawan Kalyan and Nara Lokesh
ఏపీలో పలు ప్రభుత్వ పథకాలకు కూటమి ప్రభుత్వం పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ, సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ లకు అభినందనలు తెలియజేశారు. స్ఫూర్తి ప్రదాతల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. "విద్యాశాఖ అమలు చేసే పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, డాక్టర్ అబ్దుల్ కలాం వంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల పేర్లు పెట్టడాన్ని స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు. ఆ పేర్లు ప్రతిపాదించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గారికి అభినందనలు" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Pawan Kalyan
Nara Lokesh
Govt Schemes
TDP-JanaSena-BJP Alliance

More Telugu News