Chevireddy Mohith Reddy: బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Tirupati police has taken Chevireddy Mohith Reddy into custody


టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. 

ఇటీవల ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేశారు. పోలింగ్ అనంతరం, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన క్రమంలో, పులివర్తి నానిపై దాడి జరిగింది. 

ఈ ఘటనపై హత్యాయత్నం సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. తాజాగా, తిరుపతి పోలీసులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడైన మోహిత్ రెడ్డి ఈ కేసులో 37వ నిందితుడిగా ఉన్నారు.

Chevireddy Mohith Reddy
Police
Bengaluru
Pulivarthi Nani
Chandragiri
YSRCP
TDP
  • Loading...

More Telugu News