Vijayasai Reddy: చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక వెర్షన్, విపక్షంలో ఉంటే మరో వెర్షన్ వినిపిస్తాడు: విజయసాయిరెడ్డి

Vijayasareddy criticises Chandrababu
ద్వంద్వ ప్రమాణాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని పేర్కొన్నారు. 

"చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు ఒక వెర్షన్ వినిపిస్తాడు... అధికారంలో ఉన్నప్పుడు మరో వెర్షన్ వినిపిస్తాడు. ఒక్కసారి పాలనా పగ్గాలు చేపట్టాడంటే చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తాడు. అక్కడ్నించి తన గురించి, తన కుటుంబం గురించి, తన కులం గురించి, డబ్బు గురించే ఆలోచించడం మొదలుపెడతాడు" అని విజయసాయి ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
Chandrababu
YSRCP
TDP

More Telugu News