Tihar Jail: తీహార్ జైల్లో గొడవ... ఆయుధంతో తోటి ఖైదీలపై దాడి

Delhi 2 inmates injured in attack in Tihar jail
  • శుక్రవారం జైలు నెంబర్ 9లో ఘటన
  • తన వార్డులోని ఇద్దరు ఖైదీలపై పదునైన ఆయుధంతో దాడి చేసిన ఖైదీ
  • ఆసుపత్రిలో చికిత్స అందించి డిశ్చార్జ్
తీహార్ జైల్లో ఖైదీల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఒక ఖైదీ తన వార్డులోనే ఉన్న మరో ఇద్దరు ఖైదీలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారు గాయపడటంతో దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శుక్రవారం జైలు నెంబర్ 9లో చోటుచేసుకుంది. ఇద్దరు ఖైదీలపై వారి ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తి దాడి చేశాడని, కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
Tihar Jail
New Delhi

More Telugu News