Chinmayi: సలార్ నటుడిపై సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు!

Singer Chinmayi sensational allegations on Salar actor john vijay
  • సలార్ నటుడు జాన్ విజయ్‌పై మండిపడ్డ సింగర్ చిన్మయి శ్రీపాద
  • ఓ మహిళా జర్నలిస్టును జాన్ విజయ్ వేధించాడని ఆరోపణ
  • తనతో ఓ ఇంటర్వ్యూలో అసభ్యంగా ప్రవర్తించాడని ఆగ్రహం
  • జాన్ విజయ్, వైరముత్తు ఒకే జాతికి చెందిన వాళ్లంటూ విమర్శ
మహిళల హక్కుల కోసం నిత్యం గొంతెత్తే సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను నిష్కర్షగా పంచుకుంటూ ఉంటారు. మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాలను ఎండగడుతుంటారు. మీటూ ఉద్యమకాలం నుంచి స్త్రీల స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడుతూ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆమె తాజాగా సలార్ నటుడు జాన్ విజయ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 

జాన్ విజయ్ గతంలో ఓ మహిళా జర్నలిస్టును వేధించాడని, ఓ ఇంటర్వ్యూలో తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. పబ్‌లు, రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాల్లో ఆడవాళ్లతో జాన్ విజయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. 

విజయ్ డీఎంకే వ్యక్తి అని, వైరముత్తు, విజయ్ ఒకే జాతికి చెందిన వారని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి కంటికి మహిళలు కనిపిస్తే చాలు రెచ్చిపోతారంటూ మండిపడ్డారు. ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారడంతో జనాలు రకరకాల కామెంట్స్‌తో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కాగా, సలార్ మూవీలో జాన్ విజయ్ రంగ రోల్‌లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో విలన్‌గా మెప్పించారు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషలకు చెందిన పలు సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నారు.
Chinmayi
Harassment
Actor John Vijay

More Telugu News