Nara Lokesh: అమెరికాలోని పరిచయాలతో ఏపీకి కంపెనీలు తీసుకురండి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో లోకేశ్

Minister Lokesh interesting debate with MLA Ramu
  • యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను తీసుకున్నావా? అని అడిగిన లోకేశ్
  • తాను ఆ పని మీదే ఉన్నానన్న వెనిగండ్ల రాము
  • కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మంత్రి నారా లోకేశ్ మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ సాగింది. అమెరికాలో నీకున్న పరిచయాలతో ఏపీకి కంపెనీలు తీసుకు రావాలని నారా లోకేశ్ ఆయనకు సూచించారు. యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను తీసుకున్నావా? అని లోకేశ్ అడిగారు. తాను ఆ పని మీదే ఉన్నానని వెనిగండ్ల తెలిపారు. కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. అమెరికా సాఫ్టువేర్ సంస్థల ద్వారా ఉద్యోగాలు ఇప్పించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం అని లోకేశ్ అన్నారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News