Alleti Maheshwar Reddy: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఏడారి అవుతుంది!: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy fires at congress and brs
  • ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చారని పదేపదే చెప్పడం సరికాదన్న ఎమ్మెల్యే
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సభలో తమను మాట్లాడనివ్వడం లేదని విమర్శ
  • కేంద్రానికి కనీసం డీపీఆర్ ఇచ్చారా? అని ప్రశ్నించిన మహేశ్వర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్లు ఇచ్చారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పదేపదే చెప్పడం సరికాదని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కనుక తెలంగాణ ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి సభలో తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు.

ఏపీకి ఇచ్చారని పదేపదే చెబుతున్నారని... కనీసం కేంద్రానికి మీరు డీపీఆర్‌లు ఇచ్చారా? అని నిలదీశారు. మూసీని ఏటీఎంలా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి తన నియోజకవర్గం కొడంగల్‌కు రూ.4 వేల కోట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
Alleti Maheshwar Reddy
BJP
BRS
Congress

More Telugu News