: గోవా సమావేశానికి రేపూ గైర్హాజరవుతున్న అద్వానీ!

వరుసగా రెండు రోజుల పాటు గోవాలో జరుగుతున్న జాతీయ సమావేశాలకు డుమ్మా కొట్టిన బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ రేపు కూడా గైర్హాజరవుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ పనాజీలో మీడియాతో చెప్పారు. తీవ్ర అనారోగ్యంవల్ల మూడు, నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. అందుకే రేపటి సమావేశానికి కూడా రాకూడదని అద్వానీ నిర్ణయించుకున్నట్లు వివరించారు. అయితే, ఈ విషయంపై రాజ్ నాథ్ సింగ్ ఆయన(అద్వానీ)తో మాట్లాడారని, ఇబ్బందితో సమావేశాలకు హాజరుకానవసరంలేదని సూచించినట్లు జవదేకర్ చెప్పారు.

More Telugu News