Crop Insurance: ఏపీలో రైతులందరికీ పంట బీమా... సబ్ కమిటీ నిర్ణయం

Sub Committee decides crop insurance will apply for all farmers in AP
  • అచ్చెన్నాయుడు అధ్యక్షతన మంత్రులు, అధికారుల సబ్ కమిటీ సమావేశం
  • హాజరైన పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ధూళిపాళ్ల నరేంద్ర 
  • వ్యవసాయంపై ప్రకృతి విపత్తుల ప్రభావంపై చర్చ
  • విపత్తుల సమయాల్లో రైతులకు న్యాయం జరగాలన్న సబ్ కమిటీ
ఏపీలో రైతులందరికీ పంట బీమా అమలు చేయాలని మంత్రులు, అధికారులతో కూడిన సబ్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన నేడు సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సబ్ కమిటీలో పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ధూళిపాళ్ల నరేంద్ర సభ్యులుగా ఉన్నారు. 

ఈ సమావేశంలో వ్యవసాయంపై ప్రకృతి విపత్తుల ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా పంటల బీమా అంశంపై నిర్ణయం తీసుకున్నారు. గత సర్కారు హయాంలో పంటల బీమా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని సబ్ కమిటీ సభ్యులు విమర్శించారు. 

విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలంటే సరైన పంటల బీమా విధానం అమల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులందరికీ న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.
Crop Insurance
Farmers
Sub Committee
Atchannaidu
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News