Kuwait Couple Divorces: పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. మంజూరు చేసిన కోర్టు

A couple divorced just three minutes in Kuwait in 2019
  • కువైట్‌లో 2019లో జరిగిన ఆసక్తికర ఘటన
  • బ్యాలెన్స్ తప్పి పడిపోవడంతో తెలివి తక్కువ దద్దమ్మ అని పిలిచిన భర్త
  • ఆగ్రహంతో పెళ్లి రద్దు చేసుకున్న ఘటన
  • ఇటీవల ఓ పెళ్లిలో భార్యను భర్త ఎగతాళి చేయడం చూశానంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టడంతో నాటి ఘటన వైరల్
గల్ఫ్ దేశం కువైట్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఓ జంట పెళ్లైన 3 నిమిషాలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. పెళ్లి పూర్తయ్యి భార్యాభర్తలుగా మారాక పెళ్లి వేడుక నుంచి వెళ్తున్న సమయంలో పెళ్లికూతురు బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. అయితే పక్కనే ఉన్న వరుడు ‘తెలివి తక్కువ దద్దమ్మ’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఈ మాట విన్న పెళ్లి కూతురు ఆ క్షణమే అతడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. పెళ్లిని రద్దు చేసుకుంటున్నానని ప్రకటించి కోర్టుని ఆశ్రయించింది. లాంఛనమైన విచారణ ముగిసిన తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసింది. కువైట్ చరిత్రలోనే అతి స్వల్పకాల పెళ్లిగా దీనిని చెబుతుంటారు. 

నిజానికి 2019లో జరిగిన ఈ ఘటన తాజాగా వైరల్‌గా మారింది. తాను ఒక వివాహానికి వెళ్లానని, అక్కడ పెళ్లికూతురుని వరుడు ఎగతాళి చేస్తూ గడిపాడని, ఆమె కూడా ఆ మహిళలా (కువైట్ మహిళ) విడాకులు ఇచ్చి ఉండాల్సిందంటూ ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టడంతో నాటి ఘటన మరోసారి వైరల్ అయింది. గౌరవం లేకపోవడం పెళ్లిలో తొలి వైఫల్యమని సదురు వ్యక్తి పేర్కొన్నాడు. పెళ్లి మొదట్లోనే ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తులను వదిలివేయడం మంచిదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

కాగా 2004లో యూకేలో ఒక జంట పెళ్లైన 90 నిమిషాల తర్వాత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. రిజిస్టర్ ఆఫీస్‌లో స్కాట్ మెక్కీ, విక్టోరియా ఆండర్సన్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ తోటి పెళ్లికూతుళ్లను ఇబ్బంది పెట్టినందుకు పెళ్లి కొడుకుపై వధువు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరగడంతో విడాకులు తీసుకుంది.
Kuwait Couple Divorces
Kuwait
Off beat News
Viral News

More Telugu News