స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను మేం సమర్థించడం లేదు: హరీశ్ రావు
- సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కోటా ఎందుకు? అన్న స్మితా సబర్వాల్
- స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదన్న హరీశ్ రావు
- రుణమాఫీ కోతలు పెట్టేందుకే రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలని విమర్శ
ఇదిలావుంచితే ... రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారని, ఈ నిబంధనల వల్ల చాలామందికి రుణమాఫీ కావడం లేదని హరీశ్ రావు విమర్శించారు. కోతలు పెట్టేందుకు రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు అంటున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక విభాగాల వైద్యులను జిల్లాలకు బదలీ చేశారని మండిపడ్డారు. ప్రస్తుత విభాగాలలోనే సూపర్ స్పెషాలిటీ నిపుణులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు డీఏలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను ప్రభుత్వం పాటించాలని సూచించారు.