Bihar: బీహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం

Centre Rules Out Special Status For Bihar
  • ప్రత్యేక హోదాపై లోక్ సభలో ప్రశ్నించిన జేడీయూ ఎంపీ
  • బీహార్ సహా వెనుకబడిన రాష్ట్రాలకు హోదా ఇస్తారా? అని ప్రశ్న
  • ఎన్డీసీ నిబంధనల ప్రకారం సాధ్యం కాదన్న కేంద్రం
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. బీహార్‌కు ప్రత్యేక హోదాపై జేడీయూ ఝంఝాపూర్ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ లోక్ సభలో అడిగారు. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్‌తో పాటు ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రణాళిక కేంద్రం వద్ద ఉందా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని పేర్కొన్నారు. ఎన్డీసీ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని తెలిపారు.

ప్రత్యేక కేటగిరీ లేదా హోదాను కొన్ని రాష్ట్రాలకు ఇచ్చేందుకు ఎన్డీసీ సూచనలు చేసిందని తెలిపింది. ఇందులో 1. కొండలు, క్లిష్టమైన భూభాగం ఉన్న ప్రాంతాలు, 2. తక్కువ జనాభా లేదా అత్యధిక గిరిజన జనాభా, 3. పొరుగు దేశాలతో సరిహద్దు కలిగిన వ్యూహాత్మక ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలు, 4. ఆర్థిక, మౌలిక వసతుల లేమి కలిగిన రాష్ట్రాలు, 5. అత్యల్ప ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలు ప్రత్యేక హోదాకు అర్హులను కేంద్రం స్పష్టం చేసింది. 2012లో ఇంటర్ మినిస్ట్రీ రియల్ గ్రూప్ బీహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించిందని, అయితే ఎన్డీసీ నిర్దేశించిన ప్రమాణాలలో బీహార్ అర్హత సాధించలేకపోయిందని పేర్కొన్నారు.
Bihar
JDU
Narendra Modi
Government

More Telugu News