Telangana: పాఠశాలల వేళలను మారుస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు

Telangana Education department changes in school timings
  • ప్రాథమిక పాఠశాలలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల్లో సమయం మార్పు
  • అరగంట ముందుకు జరిపిన తెలంగాణ విద్యాశాఖ
  • హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో పాత పనివేళలు కొనసాగుతాయని వెల్లడి
పాఠశాలల వేళలను మారుస్తూ తెలంగాణ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయానికి అనుగుణంగా ఉన్నత పాఠశాలల్లో సమయాలను మార్పు చేసింది. ఉన్నత పాఠశాల సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు మారుస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు పనివేళలు ఉండేవి. ఇప్పుడు ఉదయం అరగంట సమయాన్ని ముందుకు జరిపి, సాయంత్రం కూడా ముందుకు జరిపింది.

అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడ పాఠశాలలు ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి.
Telangana
Congress

More Telugu News