Mohan Babu: ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనుటకు అందరూ ఆహ్వానితులే: మోహన్ బాబు

Mohan Babu invites all to attend Guru Pournami Pooja in Titupati

  • రేపు గురు పౌర్ణమి
  • మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
  • సోషల్ మీడియాలో ప్రకటన చేసిన మోహన్ బాబు 

రేపు (జులై 21) గురుపౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా సాయినాథుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయిబాబా భక్తుడైన సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా గురుపౌర్ణమి సందర్భంగా తన ఇష్ట దైవానికి తిరుపతిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. 

"రేపు ఆదివారం 2024 జులై 21న గురు పౌర్ణమి సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలో నెలకొన్న సాయినాథుని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనుటకు అందరూ ఆహ్వానితులే. సాయినాథుని సేవ సర్వ సద్గురు సేవ... జై సాయి రామ్" అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.

Mohan Babu
Guru Pournami
Mohan Babu University
Tirupati
  • Loading...

More Telugu News