Muchumarri: ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక కుటుంబానికి రూ. 10 లక్షల చెక్ అందజేత

Govt Hands Rs 10 Lakh Check To Muchumarri Girl Family
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం నిన్న రూ. 10 లక్షల పరిహారం చెక్కును అందించింది. నిన్న గ్రామాన్ని సందర్శించిన మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున పరిహారం అందించామని, వారి ఇంటికి మరమ్మతులు కూడా చేయిస్తామని తెలిపారు. బాధిత తల్లికి ఉపాధి కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. బాలిక ఆచూకీ దొరికే వరకు గాలింపు కొనసాగుతుందని తెలిపారు.
Muchumarri
Nandyal
Andhra Pradesh
Crime News

More Telugu News