Chandrababu: ఖజానా నిండాలని కోరుతూ.. ఆరు రొట్టెలు వదలండి: చంద్రబాబు

Chandrababu video conference on Rottela Panduga
  • బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని హామీ
  • ఈ దర్గా అంటే తనకు ఎంతో నమ్మకం ఉందని వ్యాఖ్య
నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పండుగకు దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ప్రశాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ... బారాషహీద్ దర్గా చరిత్ర ఎంతో గొప్పదని చెప్పారు. ఈ దర్గా అంటే తనకు కూడా ఎంతో నమ్మకమని తెలిపారు. రొట్టెలు పంచుకోవడం, కోర్కెలు తీరడం, కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ వచ్చి మరొకరికి ఇవ్వడం... ఇదంతా ఒక నమ్మకమని చెప్పారు. ఈ పండుగలో సర్వమత సమ్మేళనాన్ని చూడొచ్చని అన్నారు. రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపుని తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని.... అయినా, సంపద సృష్టిస్తామనే నమ్మకం ఉందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని... ఖజానా నిండాలని కోరుకుంటూ ఆరు రొట్టెలు వదలాలని చెప్పారు.
Chandrababu
Telugudesam
Rottela Panduga

More Telugu News