Donald Trump: ట్రంప్ పై హత్యాయత్నం సీన్ ను రిక్రియేట్ చేసిన ఉగాండా కిడ్స్.. వీడియో ఇదిగో!

Children In Uganda Recreate Trumps Assassination Attempt
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు
  • ఫైట్ ఫైట్ అంటూ అరుస్తూ నవ్వులు పూయిస్తున్న బుల్లి ట్రంప్
అమెరికా మాజీ ప్రెసిడెంట్, 2024 ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవల హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. కొద్దిలో ప్రాణాపాయం తప్పించుకున్న ట్రంప్ మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దుండగుడు కాల్పులు జరపడం, సెక్యూరిటీ సిబ్బంది అతడిని తుదముట్టించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోనే చైనాలో లోకల్ కంపెనీ ఒకటి ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన ఫొటోతో టీషర్టులు అమ్మకానికి సిద్ధం చేసింది. నిమిషాల వ్యవధిలోనే సదరు టీషర్టులకు ఆన్ లైన్ ద్వారా వేలల్లో ఆర్డర్లు వచ్చాయని కంపెనీ వివరించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది. ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన ఘటనను ఉగాండా పిల్లలు రిక్రియేట్ చేశారు. ఓ పిల్లాడు ట్రంప్ ను అనుకరిస్తూ స్టేజిపై మాట్లాడుతుండగా.. చుట్టూ కర్ర తుపాకులతో బుల్లి ట్రంప్ కు సెక్యూరిటీగా నలుగురు భద్రతా సిబ్బంది నిలుచున్నారు. ఇంతలో బుల్లెట్ సౌండ్ వినిపించగా.. చెవి పట్టుకుని ట్రంప్, ఆయనను చూసి భద్రతా సిబ్బంది స్టేజీ పైనే కూర్చుండిపోతారు.

ఆపై ట్రంప్ ‘ఫైట్ ఫైట్’ అంటూ నినాదాలు చేస్తుండగా సెక్యూరిటీగా నటిస్తున్న పిల్లలు ఆయనను పట్టుకుని కిందికి తీసుకెళతారు. అచ్చంగా డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాన్ని ఉగాండా పిల్లలు నటించి చూపించారు. ఈ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది. దీంతో ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు.
Donald Trump
Assassination Attempt
Uganda
Children
Recreation

More Telugu News