Jagan: జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన

Guntur IG key announcement on Jagan visit to Vinukonda
  • బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్
  • రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్
  • జన సమీకరణతో ప్రదర్శనలు చేయరాదన్న ఐజీ
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్తున్నారు. బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ అనే యువకుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలక ప్రకటన చేశారు. 

వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఐజీ తెలిపారు. పట్టణంలో ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించవచ్చని... కానీ, జన సమీకరణతో ప్రదర్శనలు చేయరాదని స్పష్టం చేశారు. వినుకొండలో ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి ఉందని... అనవసరంగా ఎవరూ రోడ్లపైకి వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని హెచ్చరించారు. మరోవైపు, జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Jagan
YSRCP
Vinukonda
Guntur IG

More Telugu News