Nara Lokes: అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది: మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh criticizes that YS Jagan talking about corruption is making fulsomeness
బాధితులనే నిందితులు చేసి ప్రభుత్వం ఉగ్రవాదానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందని, మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూటమి ప్రభుత్వం కూకటివేళ్లతో పెకిలించి వేస్తోందని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విమర్శించారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి మాజీ సీఎం, వైఎస్సాఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్... తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. 

‘‘శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? నేరాలు చేసి మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు. ఏ నిందితుడినీ వదిలేది లేదు. బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది’’ అని నారా లోకేశ్ అన్నారు.

వినుకొండలో ఓ యువకుడి దారుణహత్యకు టీడీపీయే కారణమంటూ విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించిన నేపథ్యంలో కౌంటర్‌గా నారా లోకేశ్ ఈ విధంగా స్పందించారు.
Nara Lokes
Telugudesam
YS Jagan
YSRCP
Andhra Pradesh
AP Politics

More Telugu News