Amul: అమూల్ బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు.. వీడియో ఇదిగో!

Man Finds Live Worms in Amul Buttermilk Ordered Online
  • ఆన్ లైన్ లో అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ చేసిన కస్టమర్ షాక్
  • సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్
  • సారీ చెప్పిన అమూల్ కంపెనీ
  • మరోసారి రిపీట్ కానివ్వబోమని హామీ
అధిక ప్రొటీన్ మజ్జిగతో పాటు అమూల్ కంపెనీ పురుగులను కూడా ఫ్రీగా పంపించిందంటూ ఓ కస్టమర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. తను అందుకున్న బటర్ మిల్క్ ప్యాకెట్ ను, వాటిలో తిరుగుతున్న పురుగులను ఫొటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ పోస్టు వైరల్ గా మారింది. గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఈ పోస్టును చూశారు. అమూల్ కంపెనీ తీరుపై నెటిజన్లు కామెంట్లలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరుతున్నారు.

అమూల్ కస్టమర్ ఒకరు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ లో నెటిజన్లతో పంచుకున్నారు. ఇటీవల తాను ఆన్ లైన్ వేదికగా అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ చేశానని చెప్పారు. అయితే, కంపెనీ నుంచి వచ్చిన ప్యాకెట్ ను విప్పిచూశాక షాక్ కు గురయ్యానని వివరించారు. ప్యాకెట్ లో పురుగులు కనిపించడమే కారణమని చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తమకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని, అమూల్ ఉత్పత్తులు ఎవరూ కొనొద్దని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఏకంగా నాలుగున్నర లక్షల మంది చూశారు. వీడియో వైరల్ కావడంతో అది అమూల్ కంపెనీ దాకా చేరింది. దీంతో సదరు కంపెనీ వివరణ ఇచ్చింది. కస్టమర్ కు క్షమాపణలు చెబుతూ మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కస్టమర్ కు హామీ ఇచ్చింది.
Amul
Buttermilk
Customer Shok
Live Worms
Viral Videos

More Telugu News