తమ కార్యకర్త రషీద్ హత్యపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన వైసీపీ
- ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఆరోపణ
- వెరీ బ్యాడ్ మార్నింగ్ అంటూ రాష్ట్రపతికి వైసీపీ ట్వీట్
- రాష్ట్ర ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి
వెంటనే ప్రెసిడెంట్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రతి భారతీయుడూ తమకు మద్దతు పలకాలని ట్వీట్ లో వైసీపీ కోరింది. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ బుధవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ హత్యకు పాతకక్షలే కారణమని పల్నాడు ఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వెల్లడించారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయని, వైసీపీ నేతలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు.