Dubai Princess: దుబాయ్ యువరాణి సంచలన నిర్ణయం... బిడ్డ పుట్టిన రెండు నెలలకే విడాకులు

Dubai Princess Sheikh Mahra sensational announcemnt on divorce
  • యూఏఈ ప్రధాని కుమార్తె షైకా సోషల్ మీడియా పోస్టు సంచలనం
  • 2023లో ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనాతో వివాహం
  • ఇటీవలే తొలి బిడ్డ జననం.. అంతలోనే విడాకులు
తొలి బిడ్డ పుట్టిన రెండు నెలలకే దుబాయ్ యువరాణి షైకా మహ్రా మహ్మద్ రషీద్ అల్ మక్తూమ్ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం సంచలనం సృష్టించింది. యువరాణి షైకా... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. 

దుబాయ్ కి చెందిన సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ తో యువరాణి షైకా వివాహం 2023 మే 27న జరిగింది. ఇటీవలే షైకా, మనా దంపతులకు తొలి సంతానం కలిగింది. అంతలోనే విడాకులు తీసుకుంటున్నట్టు యువరాణి షైకా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. 

అది కూడా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడాకుల ప్రకటన చేశారు. ప్రియమైన భర్తకు... మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు... అందుకే మీ నుంచి విడాకులు తీసుకుంటున్నాను... ఇట్లు మీ మాజీ భార్య అంటూ సంచలన పోస్టు పెట్టారు. 

కాగా, షైకా, మనా ఇద్దరూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. తామిద్దరూ కలిసి దిగిన ఫొటోలను కూడా డిలీట్ చేసేశారు. 

దుబాయ్ యువరాణి షైకా బ్రిటన్ లోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో స్పెషలైజేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు.
Dubai Princess
Sheikha Mahra
Divorce
Dubai
UAE

More Telugu News