బడ్జెట్ సన్నాహాలు... పార్లమెంటులో హల్వా తయారుచేసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

  • జులై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • జులై 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
  • పార్లమెంటు నార్త్ బ్లాక్ లో హల్వా తయారీ కార్యక్రమం
  • హాజరైన నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు, పార్లమెంటు సిబ్బంది
ఎన్డీయే 3.0 ప్రభుత్వం వచ్చాక తొలిసారి పూర్తి స్థాయి పార్లమెంటు సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 

బడ్జెట్-2024 సన్నాహాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, సంప్రదాయం ప్రకారం పార్లమెంటులో నిర్మలా సీతారామన్ హల్వా తయారుచేశారు. ఆర్థిక శాఖ అధికారులకు, పార్లమెంటు సిబ్బందికి ఆమె స్వయంగా హల్వాను వడ్డించారు. ఈ కార్యక్రమం పార్లమెంటు నార్త్ బ్లాక్ లో నిర్వహించారు.

Nirmala Sitharaman
Halwa
Budget-2024
Parliament
New Delhi

More Telugu News