Amith Mishra: ‘వయసు మోసం’ చేశాను.. అంగీకరించిన భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా

Lucknow Super Giants spinner Amith Mishra admitted that he decreases his age by one year
  • అరంగేట్రం చేసినప్పుడు 22 ఏళ్లయితే 21 సంవత్సరాలని నమ్మించానని వెల్లడి
  • కోచ్ సలహా మేరకు ఇలా చేశానని వెల్లడి
  • ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా
ఐపీఎల్‌లో ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న భారత మాజీ క్రికెటర్, స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రా ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. వయసు విషయంలో తాను మోసానికి పాల్పడ్డానని, 2003లో భారత జట్టులోకి అరంగేట్రం చేసినప్పుడు తన వయసును ఒక ఏడాది తగ్గించుకుని చూపించానని వెల్లడించాడు. అప్పుడు తన వయస్సు 22 సంవత్సరాలైతే 21 ఏళ్లుగా తప్పుదోవ పట్టించానని ఒప్పుకున్నాడు. తన కోచ్ సలహా మేరకు ఈ విధంగా వ్యవహరించినట్టు చెప్పాడు. శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో అమిత్ మిశ్రా ఈ విషయాలను బయటపెట్టాడు.

వయసు తక్కువగా చూపించాలనే ఆలోచన తనకు రాలేదని, తన కోచ్ ఇంటికి పిలిచి మరీ చెప్పారని అమిత్ మిశ్రా ప్రస్తావించాడు. కోచ్ ఈ విషయాన్ని చెప్పినప్పుడు తాను చాలా ఆశ్చర్యపోయానని, ఎలా సాధ్యమని ప్రశ్నించానని, అయితే వయసు తగ్గించుకునేందుకు ఒప్పుకున్నానంటూ గుర్తుచేసుకున్నాడు. ఇది చాలా భావోద్వేగ కథ అని, ఆ రోజు నుంచి తాను ఒక సంవత్సరం చిన్నవాడిని అయ్యానని చెప్పాడు. కాగా అమిత్ మిశ్రా ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు.

రోహిత్ శర్మతో జరిగిన సంభాషణ ఇదే..
కాగా ఐపీఎల్ 2024లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, మిత్ మిశ్రా మధ్య వయసుకు సంబంధించి సరదా సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారిన నేపథ్యాన్ని ప్రశ్నించగా పాడ్‌కాస్ట్‌లో అమిత్ మిశ్రా స్పందించారు. ‘‘నాకు నిజంగా 41 ఏళ్లేనా అంటూ రోహిత్ శర్మ ప్రశ్నించాడు. మేము చెడ్డీలు వేసుకున్నప్పుడు అరంగేట్రం చేశావ్ ఇంకా 41 ఏళ్లేనా? అని సరదాగా అన్నాడు. అవును 20-21 ఏళ్లప్పుడు చేసి ఉంటానని చెప్పాను. ఆ తర్వాత నీకు నిజంగా 74 ఏళ్లేనా అని రోహిత్‌ను అడిగాను. అతడు బిగ్గరగా నవ్వుతూ ఇక మాట్లాడొద్దు అన్నాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య ఈ సరదా సంభాషణ జరిగింది’’ అని అమిత్ మిశ్రా వెల్లడించాడు.
Amith Mishra
Lucknow Super Giants
Rohit Sharma
Cricket
IPL 2024

More Telugu News