తెలంగాణలోని అంగన్వాడీలకు గుడ్ న్యూస్
- రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వనున్న సర్కారు
- టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ. లక్ష
- రెండు రోజుల్లో జీవో జారీ.. మంత్రి సీతక్క ప్రకటన
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద పదవీ విరమణ పొందే టీచర్ కు రూ.2 లక్షలు, ఆయాలకు రూ. లక్ష చొప్పున తెలంగాణ ప్రభుత్వం అందజేయనుంది. నామమాత్రపు వేతనంతో సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది కష్టాలు ప్రభుత్వానికి తెలుసని మంత్రి చెప్పారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, రెండు మూడు రోజుల్లో ఈమేరకు జీవో విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.