Nara Lokesh: కువైట్ లో కష్టాలు పడుతున్న ఏపీ వ్యక్తి వీడియోపై మంత్రి నారా లోకేశ్ స్పందన
- ఎవరైనా సాయం చేయకపోతే తనకు చావే శరణ్యమన్న శివ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- శివ విషయం చూడాలని ఎన్నారై టీడీపీ బృందానికి లోకేశ్ సూచన
- కువైట్ లో శివను కాపాడిన భారత ఎంబసీ
బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి, అక్కడ పడరాని కష్టాలు పడుతున్న శివ అనే ఏపీ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఎవరైనా సాయం చేయకపోతే తనకు ఇక చావే శరణ్యం అంటూ శివ కన్నీటిపర్యంతమయ్యాడు.
దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. శివ విషయం చూడాలని కువైట్ లోని ఎన్నారై టీడీపీ బృందానికి లోకేశ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో శివను త్వరలోనే ఏపీకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కాగా, కువైట్ లో కష్టాలు పడుతున్న శివను భారత ఎంబసీ కాపాడింది. అతడిని భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Desperate Migrant Worker in Kuwait stuck in a dessert makes appeal
— Sudhakar Udumula (@sudhakarudumula) July 15, 2024
His family at home awaits his return
A migrant worker from Annamaih district of AP stranded in the harsh desert of Kuwait, has reached out for help in a heart-wrenching plea. "Sir, save me, or suicide is my… pic.twitter.com/b8b0ZrZsvk