Ramana Deekshitulu: ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా.. కేసుల నుంచి విముక్తి ప్రసాదించండి: రమణ దీక్షితుల వేడుకోలు

Ramana Deekshitulu Urged AP Government To Suspend Cases Against Him
  • టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని వేడుకున్న రమణ దీక్షితులు
  • శ్రీవారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పించాలని వేడుకోలు
  • అలా చేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటానన్న శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గత పాలనాధికారులు తనపై పెట్టిన అక్రమ కేసులతో ఐదేళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నానని, ఆ కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. 

తనపై పెట్టిన కేసులను నూతన ప్రభుత్వం తొలగించి ఉపశమనం కల్పించాలని వేడుకున్నారు. శ్రీవారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొందరిపై పెట్టిన అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించనున్నట్టు టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయనీ విన్నపం చేశారు.  ప్రభుత్వం అలా ప్రకటించడం గొప్ప విషయమని రమణ దీక్షితులు పేర్కొన్నారు.
Ramana Deekshitulu
TTD
Tirumala

More Telugu News