: 'భారత క్రికెట్ భవిష్యత్' శిఖర్ ధావన్: కపిల్ దేవ్
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాతో జరిగిన పోరులో అసాధారణ ప్రతిభ చూపిన శిఖర్ ధావన్ భారత క్రికెట్ భవిష్యత్ అని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభివర్ణించారు. బౌన్సీ వికెట్ ఉండే ఇంగ్లాండ్ పరిస్థితుల్లో సైతం ధావన్ అత్యత్తుమ పోరాట పటిమ చూపించాడని, ఇదే తెగువ మిగిలిన మ్యాచ్ లలో కూడా చూపించాలని ఆకాంక్షించారు. ఈ టెక్నిక్ భవిష్యత్తులో కొనసాగిస్తే ధావన్ తిరుగులేని క్రికెటర్ గా ఎదుగుతాడని వ్యాఖ్యానించారు.