Mukesh Ambani: పోస్ట్ వెడ్డింగ్ వేడుకకు సిద్ధమవుతున్న అనంత్, రాధికా మర్చంట్?

Ambanis get ready for post wedding celebrations
ఇటీవలే ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రపంచ ప్రముఖులు అనేక మంది హాజరయ్యారు. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా కొన్ని నెలల పాటు విడతల వారీగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిపిన అంబానీ కుటుంబం అంతే అట్టహాసంగా పెళ్లి కూడా జరిపించింది. తాజాగా అంబానీ కుటుంబం పోస్టు వెడ్డింగ్ వేడుకలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లండన్‌లో ఈ వేడుకలు ఉంటాయని సమాచారం. 
Mukesh Ambani
Anant Ambani
Post Wedding celebrations

More Telugu News