Anant Ambani: ఒక్కో వాచీ ఖరీదు రూ. 2 కోట్లు.. గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ.. వీడియో ఇదిగో!

Anant Ambani gifts luxury watches worth Rs 2 crore to Shah Rukh Khan and Ranveer Singh

  • షారూఖ్, రణ్‌వీర్ తదితరులకు గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ
  • లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ 
  • వాచీలతో ఫొటోలు, వీడియోలకు పోజులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ఈ నెల 12న ఘనంగా జరిగింది. గతేడాది డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంబానీ ఇంట వేడుకలు జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌లో వివాహంతో అనంత్-రాధికా ఒక్కటయ్యారు. నిన్న జరిగిన ఆశీర్వాద వేడుకకు భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు సహా ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిమంది అతిథులు హాజరయ్యారు. 

తాజాగా ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. తనకు స్నేహితులైన బాలీవుడ్ నటులు షారూఖ్‌ఖాన్, రణవీర్‌సింగ్, షికర్ పహారియా, వీర్ పహారియా, మీజాన్ జాఫరి తదితరులకు వరుడు అనంత్ అంబానీ ఒక్కొక్కరికీ రూ. 2 కోట్ల విలువైన రిస్ట్ వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ క్యాలెండర్ లిమిటెడ్ ఎడిషన్ వాచీలను వీరు బహుమతిగా అందుకున్నారు. అనంతరం అందరూ కలిసి చేతికి ధరించిన వాచీలు చూపిస్తూ ఫొటోలు, వీడియోలకు పోజిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anant Ambani
Radhika Merchant
Shahrukh Khan
Ranveer Singh
Audemars Piguet
Royal Oak Perpetual Calendar Luminary Edition
  • Loading...

More Telugu News