Viziangaram: ఉయ్యాలలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిపై తాతయ్య అఘాయిత్యం

Elder Man Assaulted SiX Month Old In Viziangaram
  • విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో ఘటన
  • గ్రామస్థులు వెంబడించడంతో తప్పించుకున్న వృద్ధుడు
  • చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారి
  • నార్లవలసలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఊయలలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నారిని ఊయలలో వేసిన తల్లి కిరాణషాపుకు వెళ్లడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నార్లవలసకు చెందిన బోయిన ఎరకన్న దొర పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంతో అక్కడికి చేరుకున్న ఆమె అక్క తల్లికి విషయం చెప్పింది. విషయం గ్రామస్థులకు తెలియడంతో అందరూ కలిసి వృద్ధుడిని వెంబడించారు. అయినప్పటికీ వారికి చిక్కకుండా తప్పించుకున్నాడు. 

మరోవైపు, తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా కేంద్రం  విజయనగరంలోని ఘోష ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పాప కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నార్లవలసలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Viziangaram
Crime News
AP Police
POCSO

More Telugu News