Shubh Ashirwad: అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ 'శుభ్ ఆశీర్వాద్' ఫంక్షన్ కు హాజరైన రామ్ చరణ్, ఉపాసన

- ముంబయిలో అట్టహాసంగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం
- ఈ సాయంత్రం జియో కన్వెన్షన్ సెంటర్ లో శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్
- నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్, ఉపాసన
గత కొన్ని రోజులుగా భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నెలకొన్న కోలాహలం మామూలుగా లేదు. ప్రపంచ ప్రముఖులందరూ ముంబయికి తరలివస్తున్నారు. అందుకు కారణం... అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ మహోత్సవమే.
ఈ వేడుకల్లో భాగంగా నేడు ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు.
రామ్ చరణ్ బంద్ గలా సూట్ ధరించగా, ఉపాసన గాగ్రా డ్రెస్ లో తళుక్కుమన్నారు. రామ్ చరణ్, ఉపాసన... నూతన దంపతులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయితే బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీలో నటించనున్నారు.

