Team India: వికెట్ పడకుండా కొట్టారు.... సిరీస్ గెలిచారు!

Team India clinches T20 series against Zimbabwe
  • టీమిండియా-జింబాబ్వే మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • 3-1తో సిరీస్ గెలిచిన టీమిండియా
  • నేడు 4వ టీ20 మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా
  • 153 పరుగుల టార్గెట్ ను 15.2 ఓవర్లలో కొట్టేసిన టీమిండియా ఓపెనర్లు
  • జైస్వాల్ 93 నాఔట్... కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 58 నాటౌట్
శుభ్ మాన్ గిల్ సారథ్యంలోని యువ టీమిండియా జట్టు జింబాబ్వేతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. హరారేలో ఇవాళ జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. 

జింబాబ్వే నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా పడకుండా ఓపెనర్లే కొట్టేశారు. యశస్వి జైస్వాల్ 93, కెప్టెన్ గిల్ 58 పరుగులతో విజృంభించడంతో... టీమిండియా 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. జైస్వాల్ 53 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 సిక్సులు కొట్టగా... గిల్ 39 బంతులు ఆడి 6 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. వీరిద్దరి ధాటికి జింబాబ్వే బౌలర్లు దిక్కుతోచని స్థితిలో  పడిపోయారు. ఒక్క వికెట్టు కూడా తీయలేక ఉసూరుమన్నారు. 

ఇక, ఇరుజట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ రేపు (జులై 14) జరగనుంది.
Team India
Zimbabwe
T20 Series
Harare

More Telugu News