Prime Day Sale: కస్టమర్లకు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ డే కోసం వెయ్యి కొత్త ఉత్పత్తులు

over 1000 new products to go on sale during amazon prime day sale

  • ఈ నెల 20-21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్
  • అందుబాటులో 450 కంపెనీలకు చెందిన 1000 కొత్త ఉత్పత్తులు
  • తొలి రోజున 10 లక్షల వస్తువులు, మరుసటి రోజు 14 లక్షల వస్తువుల హోం డెలివరీ

అమెజాన్ ప్రైమ్ డే సేల్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న కస్టమర్లతో సంస్థ ఓ గుడ్ న్యూస్ పంచుకుంది. ఈ నెల 20-21 తేదీల్లో నిర్వహించనున్న సేల్ కోసం వెయ్యి కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. 

మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, హోమ్ డెకార్, ఫ్యాషన్, బ్యూటీ కేర్‌కు సంబంధించి 450 కంపెనీలు, వెయ్యికిపైగా కొత్త ఉత్పత్తులను తమ ఈకామర్స్ వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి పెట్టబోతున్నట్టు అమెజాన్ డైరెక్టర్ (షాపింగ్ ఎక్స్‌పీరియన్స్, ఇండియా అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్) తోట కిశోర్ విలేకరులతో చెప్పారు. శాంసంగ్, మోటరోలా సహా ఏడు ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్లు, ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రైమ్ డే రోజు అమెజాన్ ద్వారా కొనే వస్తువుల్లో 10 లక్షల వస్తువులను అదే రోజు, మరో 14 లక్షల వస్తువులను మరుసటి రోజు ప్రైమ్ సభ్యులకు డెలివరీ చేస్తామన్నారు.

Prime Day Sale
Amazon
Shopping Spree
  • Loading...

More Telugu News