నేను రెండో సారి సీఎం కావడం వారికి ఇష్టం లేదు: సిద్ధరామయ్య
- తాను సీఎం కావడం బీజేపీ నేతలకు ఇష్టం లేదన్న సిద్ధరామయ్య
- తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు
- బీజేపీ హయాంలోనే తన భార్యకు ఇంటి స్థలం కేటాయించారన్న సీఎం
తన భార్య పార్వతి పేరిట ఇంటి స్థలం కేటాయించడం అక్రమం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తన భార్యకు ఇంటి స్థలాన్ని మంజూరు చేసినప్పుడు బీజేపీనే అధికారంలో ఉందని చెప్పారు. గతంలో ముడా తప్పు చేసిందని... దానికి పరిహారంగా ఆ తర్వాత ఇంటి స్థలం ఇచ్చిందని తెలిపారు. భూమి కోల్పోయిన తాము ఇంటి స్థలాన్ని పొందడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమ ఇంటి స్థలాన్ని వెనక్కి తీసుకుని... వడ్డీతో కలిపి రూ. 62 కోట్లు చెల్లించినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు.